VIDEO: మాజీ సర్పంచ్ మురళీని పరామర్శించిన ఎమ్మెల్యే
CTR: గంగవరం మండల మాజీ సర్పంచ్ యల్లంపల్లి మురళీని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పరామర్శించారు. మురళీ తల్లి తిప్పక్క శనివారం ఆకస్మిక మృతి చెందారు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే స్థానిక మండల టీడీపీ నేతలు కలిసి ఆమె భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మురళీ కుటుంబీకులను పరామర్శించి తమ సంతాపాన్ని తెలియజేశారు.