టీకాలతోనే పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ
SRPT: పశువులకు సమయానికి టీకాలు వేస్తే గాలికుంటు వ్యాధి నివారించవచ్చని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండలం సంగెంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసి మాట్లాడారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి సోకితే పాల ఉత్పత్తి తగ్గిపోతుందన్నారు. 82 పశువులకు టీకాలు వేసినట్లు పేర్కొన్నారు.