హామీలను అమలు చేస్తాం: మంత్రి స్వామి

హామీలను అమలు చేస్తాం: మంత్రి స్వామి

ప్రకాశం: కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఆదివారం రాత్రి కొండపి మండలంలోని జాళ్లపాలెం తిరునాళ్లలో టీడీపీ నాయకులు ఏర్పాటుచేసిన విద్యుత్ ప్రభపై మంత్రి స్వామి మాట్లాడుతూ.. మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు.