వృద్ధుడి మిస్సింగ్.. కేసు నమోదు

GNTR: పెదకాకాని మండలం తక్కెళ్లపాడుకి చెందిన సోమయ్య (70) ఈనెల 18వ తేదీన బజారుకు వెళ్లి వస్తానని ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత వెతికినా కనిపించకపోవడంతో భార్య శివనాగేంద్రమ్మ శనివారం పెదకాకాని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.