'డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి'
BHNG: డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, ఉద్యోగులందరితో కలిసి మాదకద్రవ్యాల నిరోధక సామూహిక ప్రతిజ్ఞ చేశారు.