ట్రాక్టర్ ఢీకొని విరిగిన విద్యుత్ స్తంభం
SDPT: బెజ్జంకి ఎడ్లబండి చౌరస్తా వద్ద బుధవారం ఓ ట్రాక్టర్ ఢీకొని విద్యుత్ స్తంభం విరిగింది. ఈ ప్రమాదం వల్ల షార్ట్ సర్క్యూట్ ఏర్పడి సమీపంలోని శానగొండ విష్ణు ఇంటికి విద్యుత్ షాక్ తగిలింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంటి బయట ఉండటంతో ప్రాణాపాయం తప్పింది, కానీ ఇంట్లోని టీవీ పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అజాగ్రత్తే ఈ ప్రమాదానికి కారణమని బాధితుడు విష్ణు పోలీసులకు ఫిర్యాదు చేశారు.