ఆక్రమణలపై కొరడా ఝులిపించిన ప్రణాళికా సిబ్బంది

VZM: మున్సిపల్ కమీషనర్ పి. నల్లనయ్య ఆదేశాలతో మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులో కాలువలను ఆక్రమించుకున్న వారిపై ప్రణాళిక విభాగం సిబ్బంది కొరడా ఝులిపించారు. ఈ మేరకు కాలువలపై ఆక్రమణలు తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఈ రోడ్డులో ప్రధాన కాలువ మరమ్మతు పనులు దాదాపుగా పూర్తయ్యాయని, దీంతో పట్టణంలో మెరుగైన పారిశుద్ధ్యం,నీటి పారుదల వ్యవస్థకు దోహదం చేస్తామన్నారు.