VIDEO: విగ్రహాన్ని ఢీకొట్టిన లారీ.. డ్రైవర్‌కు గాయాలు

VIDEO: విగ్రహాన్ని ఢీకొట్టిన లారీ.. డ్రైవర్‌కు గాయాలు

BHPL: మహాదేవపూర్ మండలంలో ఇవాళ తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కాటారం నుంచి మహాదేవపూర్ ఇసుక క్వారీకి వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి అంబేద్కర్ విగ్రహాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.