బాబా మహాసమాధిని దర్శించుకున్న ప్రధాని
SS: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశాంతి నిలయంలోని బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. మహాసమాధి వద్ద కొద్దిసేపు ప్రధాని ధ్యానంలో గడిపి, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ప్రధానికి స్వాగతం పలికారు.