‘BRS నేతలే రాష్ట్రాన్ని దోచుకున్నారు’
TG: BRS నేతలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. సభా మర్యాదలకు విరుద్ధంగా వారు వ్యవహరిస్తున్న తీరు సరికాదని మండిపడ్డారు. రాష్ట్రంలో అసలైన దోపిడీకి పాల్పడింది BRS పార్టీయేనని ఆయన ఆరోపించారు. మంత్రి పొంగులేటి విషయంలో CM ఇప్పటికే స్పష్టంగా చెప్పారని గుర్తు చేస్తూ, ప్రతిపక్షాల వైఖరిపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ నిబద్ధతతో ఉందని చెప్పారు.