'అంగన్వాడీ సెంటర్‌లో యునిఫామ్, పోషకాహారం పంపిణీ'
WGL: రాయపర్తి మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్‌లో బుధవారం గ్రామ సర్పంచ్ గారే సహేంద్ర భిక్షపతి పాల్గొని పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారమైన గుడ్లను పంపిణీ చేయగా, అంగన్వాడీ బాలబాలికలకు ప్రభుత్వ యూనిఫామ్‌లను అందజేశారు. అంగన్వాడీ టీచర్లు శశిరేఖ, వేద చంద్రకళ,కవిత, తదితరులు పాల్గొన్నారు.