రాజగోపురం వద్ద వన దుర్గమ్మకు పూజలు

MDK: పాపన్నపేట మండలం నాగసనపల్లి శివారులోని శ్రీ వన దుర్గ భవాని మాతకు రాజగోపురంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూలవిరాట్ దుర్గమ్మ ప్రధాన ఆలయంలో మంజీరా నది వరద జలాలు ప్రవేశించడంతో స్థానిక రాజగోపురం వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు అందిస్తున్నారు. భక్తులు అమ్మవారిని ఇక్కడి నుంచి దర్శించుకుంటున్నారు.