ప్రజా సేవకై అంగన్వాడీ టీచర్ రాజీనామా!
MHBD: మరిపెడ మండలం గాలివారిగూడెం గ్రామ సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు కేటాయించడంతో అక్కడి అంగన్వాడీ టీచర్ రాములమ్మ ప్రజా సేవ కోసం టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. బుధవారం ఆమె తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మరో 8 ఏళ్ల సర్వీస్ మిగిలి ఉన్నప్పటికీ, ప్రజా సేవ కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్న ఆమెను అభినందించారు.