దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్
VZM: కదులుతున్న రైళ్లలో ప్రయాణికుల నుంచి చరవాణులు దొంగలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు జీఆర్పీ హెచ్.సి రవికుమార్ మంగళవారం తెలిపారు. బొబ్బిలికి చెందిన పువ్వుల శ్రీను విజయనగరం రైల్వేస్టేషన్లో పట్టుబడినట్లు చెప్పారు. గతంలో దొంగతనం చేసిన సుమారు రూ 30 వేల విలువైన చరవాణి స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.