బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
SKLM: రణస్థలం మండలం కొండమూలగాం పంచాయతీకి చెందిన దన్నాన సత్తిబాబు మాతృమూర్తి ఇటీవల మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు శుక్రవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు పలువురు నాయకులు పరామర్శించిన వారిలో ఉన్నారు.