ఉరి వేసుకుని వ్యక్తి మృతి
KMM: ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు కట్టలేరు బ్రిడ్జిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకొని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున అటుగా వెళుతున్న స్థానికులకు కంటపడడంతో పోలీసులకు సమాచారం అందించినట్లు వెల్లడించారు. బ్రిడ్జిపై నుంచి ఉరివేసుకోవడంతో తల, మొండెం వేరైయిందని స్థానికులు పేర్కొన్నారు. హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.