వేటపాలెంలో అధ్వానంగా రహదారులు

BPT: వేటపాలెంలో ప్రధాన కూడలి నందు రోడ్లు పరిస్థితి అద్వానంగా మారాయి. రోడ్లపై ఎక్కడ చూసినా గుంటలుగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాల బారిన పడుతున్నామని పలువురు వాహన దారులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గుంటలుగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.