చిన్న వెంకటరెడ్డికి నివాళులర్పించిన ఎమ్మెల్యే వేముల

NLG: నల్గొండ పట్టణానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త కొండకింది చిన్న వెంకటరెడ్డి మృతి పట్ల నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తన ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు. బుధవారం మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.