సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

SRPT: విద్యార్థులు చెడు వ్యసనాలను దూరంగా ఉండాలని పాలకవీడు ఎస్సై కోటేష్ అన్నారు. ఈరోజు మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు యూటీజింగ్, యాంటీ ర్యాగింగ్, సైబర్ నేరాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ.. గంజాయి, సిగరెట్స్, ఇతర మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.