రోడ్డు ప్రమాదాల నివారణకు 'స్టాప్-వాష్ అండ్ గో'
KRNL: రోడ్డు ప్రమాదాల నివారణకు కర్నూలు పోలీసులు ‘స్టాప్-వాష్ అండ్ గో’ కార్యక్రమం చేపట్టారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జాతీయ రహదారులపై వాహనాలను ఆపి డ్రైవర్ల పత్రాలు, లైసెన్సులు పరిశీలిస్తున్నారు. నీటితో ముఖం కడిగించి అప్రమత్తంగా ప్రయాణించాలన్నారు. అధిక వేగం, రాంగ్ రూట్ నిషేధమన్నారు.