రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన సీఐ
BPT: చీరాల రూరల్, వేటపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లకు సీఐ శేషగిరిరావు శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలు, DSP ఎండి మొయిన్ సూచనల మేరకు నేర ప్రవృత్తి కలిగిన వారిని అదుపు చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసు నిబంధనలను అతిక్రమించి నేరాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన శిక్షలు అమలు చేస్తామని ఆయన హెచ్చరించారు.