రేపటి నుంచి మండలంలో పశువులకు వ్యాధి నివారణ టీకాలు

రేపటి నుంచి మండలంలో పశువులకు వ్యాధి నివారణ టీకాలు

ATP: జాతీయ పశువైద్య నియంత్రణ పథకంలో భాగంగా ఈనెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు పశువులకు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నారు. 4 నెలల పైబడిన దూడలు, ఆవులు, గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నట్లు బొమ్మనహల్ మండల పశువైద్యాధికారి వెంకట్ రెడ్డి ఆదివారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలలో పశువైద్యశాలలో టీకాలు వేయనున్నట్లు పేర్కొన్నారు.