అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత

WNP: అనుమతులు లేకుండా రేవల్లి మండలం పాత బండరావిపాకుల నుంచి చెన్నారం గ్రామానికి ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు చెన్నారం విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో ట్రాక్టర్లను తనిఖీ చేయగా ఎటువంటి అనుమతీ పత్రాలు చూపలేదు. ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు.