జనవరిలో సింగిల్ పేజీ డిజిటలైజేషన్: మంత్రి

జనవరిలో సింగిల్ పేజీ డిజిటలైజేషన్: మంత్రి

KMM: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల సమాచారంతో కూడిన సింగిల్ పేజీ డిజిటలైజేషన్‌ను వచ్చే జనవరి నెలాఖరుకల్లా అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన కసరత్తును ఎన్ఐసీ ఇప్పటికే చేస్తోందని వెల్లడించారు. ఈ చర్యతో ప్రజలకు రికార్డుల లభ్యత మరింత సులభతరం అవుతుందన్నారు.