VIDEO: 'ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి'
NZB: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సాలురా తహసీల్దార్‌కు బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో నెరవేర్చకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గంగాధర్ తదితరులు పాల్గోన్నారు.