బైక్ దొంగ అరెస్ట్.. రెండు బైక్‌లు స్వాధీనం
అనకాపల్లి మండలం కొత్తూరు వంతెన వద్ద బైక్ దొంగను సోమవారం అరెస్టు చేసినట్లు సీఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. అతని వద్ద నుంచి రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు పి.రాము అనే నేరస్తుడిని టౌన్ ఎస్సై సంతోష్ కుమార్ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.