VIDEO: జెడ్పీ హైస్కూల్లో వరల్డ్ ఎయిడ్స్ డే
AKP: నర్సీపట్నం పెద్ద బొడ్డుపల్లి జెడ్పీ హైస్కూల్లో సోమవారం ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొట్టేటి రవి మాట్లాడుతూ.. ప్రపంచాన్ని నేటికి భయపెడుతున్న అతిపెద్ద సవాలుగా ఎయిడ్స్ వ్యాధి నిలిచిందన్నారు. ప్రపంచంలో మొదటి స్థానంలో ఎయిడ్స్ రోగులు ఉన్న పరిస్థితి నుంచి బయటపడ్డామని తెలిపారు.