వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
GNTR: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టబోయే యూనివర్సల్ హెల్త్ స్కీం అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో పీపీపీ ప్రాతిపదికన ప్రతిపాదించిన నాలుగు మెడికల్ కాలేజీల గురించి కూడా చర్చించారు.