ఇక్కడ గోవుల వలనే ప్రమాదాలు
కృష్ణా: ఇబ్రహీంపట్నం మండలంలోని ఎక్కడ చూసినా ప్రధాన రహదారుల వెంబడి గోవులతో నిండిపోతుంది. ఇక్కడ ప్రమాదాలకు కారణం గోవులే కారణమవుతున్నాయి. గుంపులు గుంపులుగా రోడ్లపై సంచరిస్తూ వాహనాలకు అడ్డురావడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రి 7 గంటల నుంచి ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో ప్రధాన రహదారి పైనే సేదతీరుతున్నాయి.