'రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలి'
MDK: ఈనెల 18న నిర్వహించనున్న మెడికల్, హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ నాలుగవ మహాసభలు విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు పిలుపునిచ్చారు. నర్సాపూర్‌లో మహాసభకు సంబంధించి గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న నాలుగవ మహాసభలకు పెద్ద ఎత్తున కార్మికులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.