మున్సిపాలిటీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ స్నేహశబరీష్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు రికార్డులను పరిశీలించారు. పెండింగ్ ఫైళ్ల గురించి ఆరా తీసి, వీలైనంత త్వరగా పెండింగ్ ఫైళ్లను పరిష్కరించాలన్నారు. కార్యాలయంలో అందిస్తున్న సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు.