'సేంద్రియ సాగుపట్ల రైతులు ఆసక్తి చూపాలి'

VZM: సేంద్రియ పంటల పట్ల రైతులు ఆసక్తి చూపాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కోరారు. శనివారం గజపతినగరం మార్కెట్ యార్డ్ ఆవరణలో 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' తొలి విడత నిధుల చెక్కును మంత్రి విడుదల చేశారు. సూపర్ సిక్స్ అమలులో భాగంగా ఈ కార్యక్రమం జరిగిందన్నారు. వ్యవసాయాన్ని రాజకీయం చేయరాదన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అంబేద్కర్, జెడి రామారావు పాల్గొన్నారు.