VIDEO: ముగిసిన వారాహి నవరాత్రుల వేడుక

CTR: పుంగనూరు పట్టణం సోమేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వారాహి దేవి అమ్మవారి నవరాత్రులు శనివారం భక్తిశ్రద్ధలతో ముగిశాయి. నవరాత్రుల చివరి రోజున ఉదయం చండీ హోమం పాలు, పెరుగు, తేనెతో విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పెద్ద ఎత్తున భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.