11 ఏళ్ల తర్వాత సైనికుడికి అంత్యక్రియలు

11 ఏళ్ల తర్వాత సైనికుడికి అంత్యక్రియలు

గత 11 ఏళ్లుగా గాజాలో పాలస్తీనీయుల ఆధీనంలో ఉన్న ఇజ్రాయెల్ సైనికుడి మృతదేహానికి ఎట్టకేలకు అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి వేలాది మంది యూదులు హాజరయ్యారు. లెఫ్టినెంట్ హదర్ గోల్డిన్ మృతదేహం కోసం ఆయన కుటుంబ సభ్యులు కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. అయితే, కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా గోల్డిన్ మృతదేహాన్ని హమాస్ అప్పగించింది. కాగా, 2014లో హమాస్ తూటాలకు ఆయన బలయ్యాడు.