కోనూరులో నాలుగు పూరిళ్లు దగ్ధం
VZM: గరివిడి మండలం కోనూరులో శుక్రవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు పూరిళ్లు దగ్ధమయ్యాయి. నంబూరు గోపి అనే రైతు ఇంట్లో దాచుకొన్న రూ. 60 వేలు నగదు కాలిపోయింది. చీపురుపల్లి అగ్నిమాపక దళ కేంద్రం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కాలిపోయిన ఇంటి పక్కనే డాబా ఇంట్లో కార్తిక దీపాలు వెలిగించారు. ఆ దీపాలు గాలికి పూరిల్లు పైన పడి మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు.