మామిడి సాగుపై అవగాహన సదస్సు

మామిడి సాగుపై అవగాహన సదస్సు

SRD: జహీరాబాద్ మండలం హోతి(బి)లో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు మామిడి సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆధునిక పద్ధతులు పాటిస్తే మామిడిలో మంచి లాభాలు వస్తాయని జిల్లా అధికారి సోమేశ్వరరావు తెలిపారు. 'ఫ్రూట్ కవర్ల' వాడకం, డ్రిప్ ఇరిగేషన్ ప్రాముఖ్యతను వివరించిన ఆయన, ఆయిల్ పామ్ సాగుపై కూడా దృష్టి పెట్టాలన్నారు.