108 అంబులెన్స్‌ను ఆకస్మిక తనిఖీ

108 అంబులెన్స్‌ను ఆకస్మిక తనిఖీ

NZB: జిల్లా డిప్యుటీ డీఎంహెచ్‌వో డా. రమేష్, సబ్ యూనిట్ ఆఫీసర్ సాయన్న ఆధ్వర్యంలో ఆర్మూర్ 108 అంబులెన్స్‌ను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరు, రికార్డులు, పరికరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఆటంకం లేని, మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచనలు చేశారు. సిబ్బంది పనితీరును వారు అభినందించారు.