పాత నేరస్థుడు అరెస్టు, బంగారు నగలు స్వాధీనం

మేడ్చల్: సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో పోలీసులు ఒక పాత నేరస్థుడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 55.95 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 4న అనీల్ కుమార్ ఇంటిలో దొంగతనం జరిగిందని ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా అంబటి విజయ్ కుమార్ అనే నిందితుడిని పట్టుకున్నారు.