ప్రజల భద్రత కోసం ప్రత్యేక చర్యలు: ఎస్సై
GNTR: చోరీలు, ద్విచక్ర వాహన దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజల భద్రత కోసం మంగళగిరి గ్రామీణ పోలీస్‌స్టేషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రజల ఆస్తి, ప్రాణ భద్రతే తమ ప్రాధాన్యత అని ఎస్సై వెంకట్ తెలిపారు. ఊరికి వెళ్లే సందర్భాల్లో ప్రజలు ముందస్తుగా పోలీసులకు సమాచారం అందిస్తే, ఉచితంగా లాక్‌హౌస్ మానిటరింగ్ సిస్టం అమర్చబడుతుందని పేర్కొన్నారు.