VIDEO: 'తెలుగు గంగ నీరు విడుదల'
TPT: NTR, మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కృషితోనే తెలుగుగంగ కాలువ నిర్మాణం సాధ్యమైందని గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ అన్నారు. వెంకటగిరి మండలం ఊట్లపల్లి వద్ద ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తెలుగుగంగ కాలువలకు సాగునీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, విజయశ్రీ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.