కన్నతీర్థంలో ఘనంగా చండీ హోమం

కన్నతీర్థంలో ఘనంగా చండీ హోమం

కడప: జమ్మలమడుగు మండలంలోని ప్రముక పుణ్యక్షేత్రమైన కన్నతీర్థంలో బుధవారం ఆషాడమాస శుద్ధ తొలి ఏకాదశి పురస్కరించుకొని ఆలయ కమిటీ చైర్మన్ శివనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. అలివేలమ్మ శిష్య బృందం చేత చండీ హోమం నిర్వహించారు.