పంచాయతీ ఎన్నికలకు బ్యాలెట్ పెట్టెలు సిద్ధం
VKB: ఈ నెల 11న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు కొడంగల్ మండలానికి చేరుకున్నాయి. మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, 222 వార్డులకు గాను మొత్తం 249 బ్యాలెట్ పెట్టెలు వచ్చాయని అధికారులు తెలిపారు. వాటిని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో భద్రపరిచారు. ఎన్నికల నేపథ్యంలో పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.