చివరి వరి గింజ వరకు కొనుగోలు చేస్తాం: ఎమ్మెల్యే

WNP: రైతులు పండించిన చివరి వరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం అమరచింత మండలం నాగల్ కడ్మూరు పామిరెడ్డి పల్లి గ్రామాలలోని రైతు వేదికలో ఐకెపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు నాణ్యమైన వరి ధాన్యం తీసుకువచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని సూచించారు.