VIDEO: దివ్యాంగ పాఠశాలను సందర్శించిన కలెక్టర్

KKD: సామర్లకోటలో సిరి దివ్యాంగ పాఠశాల, వసతి గృహాలను శుక్రవారం కలెక్టర్ షణ్మోహన్ ఆకస్మికంగా సందర్శించారు. తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, పాఠశాల అడ్మినిస్ట్రేటర్ గోపిదేవి నుంచి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నిర్వహిస్తున్న పేపర్ ప్లేట్ యూనిట్, క్లాత్ మేకింగ్ యూనిట్లను పరిశీలించారు.