స్నేహ్ రాణా రాష్ట్రానికి గర్వకారణం: సీఎం

స్నేహ్ రాణా రాష్ట్రానికి గర్వకారణం: సీఎం

ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత మహిళా క్రికెట్ జట్టులోని సభ్యురాలు స్నేహ్ రాణా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిని కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచకప్ విజేతగా నిలిచినందుకు సీఎం ఆమెను అభినందించారు. అనంతరం రాణాను శాలువాతో సత్కరించి, కేదార్నాథ్ ఆలయ చిత్రపటాన్ని బహుమతిగా అందించారు. ఆమె సాధించిన ఈ ఘనత ఉత్తరాఖండ్ రాష్ట్రానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు.