ఉక్రెయిన్‌కు పుతిన్‌ గట్టి వార్నింగ్

ఉక్రెయిన్‌కు పుతిన్‌ గట్టి వార్నింగ్

నల్ల సముద్రంలో రష్యాకు చెందిన 'షాడో ఫ్లీట్' ట్యాంకర్లపై తరచూ దాడులు జరగడంపై ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఫైరయ్యారు. ఈ దాడులకు కారణమైన ఉక్రెయిన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. సముద్రంతో ఉక్రెయిన్‌కు ఉన్న సంబంధాలను తెంచేస్తే ఈ పైరసీ దాడులు ఆగుతాయని అన్నారు. ఆ దేశ నౌకలపై దాడులను మరింత పెంచుతామని, కీవ్‌కు సాయం చేసే దేశాల ట్యాంకర్లపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.