రామాయంపేటలో తప్పిన పెను ప్రమాదం

రామాయంపేటలో తప్పిన పెను ప్రమాదం

MDK: రామాయంపేట మండల కేంద్రంలో పెను ప్రమాదం తప్పింది. సిద్దిపేట నుంచి మెదక్ వెళ్తున్న పేలాల లోడు వాహనాన్ని, ఓవర్‌ టేక్ చేసే క్రమంలో మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో సుమారు ₹10,000 విలువైన పేలాల బస్తాలు రోడ్డుపై పడిపోయి నష్టం వాటిల్లింది. ప్రమాదం తర్వాత ఆగకుండా వెళ్లిన లారీని, డ్రైవర్ సమాచారంతో రామాయంపేట పోలీసులు చాకచక్యంగా వెంబడించి పట్టుకున్నారు.