జిల్లా పోలీస్ కార్యాలయానికి 45 ఫిర్యాదులు
NZB: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 45 ఫిర్యాదులను స్వీకరించారు. సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ.. ప్రజలు నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని తెలిపారు. ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తునట్లు తెలియజేశారు.