వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఊరేగింపు

ప్రకాశం: ముండ్లమూరు మండలం మారెళ్లలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి స్వామి విగ్రహాన్ని పల్లకిలో భక్తులు కోలాహల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. 100 మందికి పైగా మహిళలు స్వామివారికి హారతులు పట్టుకొని ఊరేగింపుగా పురవీధుల్లో భక్తుల మధ్య వైభవంగా ఊరేగించారు.