సోమందేపల్లిలో ఎల్ఈడీ లైట్ల శోభ
సత్యసాయి: సోమందేపల్లిలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జ్యోతుల మహోత్సవం సందర్భంగా గ్రామం పండుగ వాతావరణంలో ముస్తాబైంది. మహోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలోని పురవీధుల్లో గురువారం ఎల్ఈడీ లైట్లతో ప్రత్యేక అలంకరణలు చేశారు. హిందూపురం పార్లమెంట్ టీడీపీ కార్యదర్శి నీరుగంటి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు పంచాయతీ సిబ్బంది గురువారం గ్రామంలోని ప్రధాన వీధులలో లైట్లు వేశారు.